తగ్గిన ఫ్రాన్స్ వృద్ధిరేటు

నిలిచిపోయిన అప్రాధాన్య కార్యకాలపాలు.. లాక్ డౌన్ కారణమన్న ‘ఇన్సీ’

france
france

ఫ్రాన్స్: కరోనా లాక్ డౌన్ తో ఫ్రాన్స్ వృద్ధి రేటు భారీగా క్షీణించింది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు 5.8 శాతం తగ్గింది. 1949 తర్వాత జీడీపీ ఈ స్థాయిలో క్షీణించడం ఇదే తొలిసారి. కాగా ఇందుకు కారణం లాక్‌డౌనే అని నేషనల్ స్టాటిస్టిక్స్ ఇనిస్టిట్యూట్ ‘ఇన్సీ’ తెలిపింది. లాక్‌డౌన్ కారణంగా అప్రాధాన్య కార్యకలాపాలు నిలిచిపోయాయని, ఫలితంగా జీడీపీ వృద్ధి ప్రతికూలంగా నమోదైందని ఇన్సీ పేర్కొంది. పైన పేర్కొన్న త్రైమాసికంలో మొత్తం వస్తు సేవల ఉత్పత్తి 5.5 శాతం తగ్గగా, నిర్మాణ రంగం 12.6 శాతం దిగజారింది. ఇక, పరికరాలు, తయారీ వస్తువుల వృద్ధి 4.8 శాతం, 5.6 శాతం తగ్గింది. మార్కెట్ సేవల ఉత్పత్తి కూడా 5.7 శాతం తగ్గినట్టు ఇన్సీ వివరించింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి :
https://www.vaartha.com/andhra-pradesh/