పరిమళాలు వెదజల్లే ఫ్లవర్‌వాజ్‌

ఇంటి అలంకరణ

Decorate Home with Flowers
Decorate Home with Flowers

తాజా పూలతో ఫ్లవర్‌వాజ్‌ను అలంకరించి హాలులోని టేబుల్‌పై పెడితే ఇంట్లో అందంగా ఉండటమే కాకుండా మనసుకు ఆహ్లాదంగా ఉంటుంది. ఫ్లవర్‌వాజ్‌ను అందంగా అలంకరించేందుకు వాడే పువ్వుల మధ్యలో మంచి డిజైన్‌గా ఉండే ఆకులు పెట్టాలి.

ఆకులు నీళ్లలో మునకుండా చూడాలి. అలంకరించిన పూల ఆకులు కాకుండా వేరు వేరు ఆకులతో అలంకరిస్తే ఫ్లవర్‌వాజ్‌ అందంగా కనిపిస్తుంది.

బాగా వికసించిన ముదురు రంగు పువ్వులు మధ్యలో పెటి, అరవిరిసిన పువ్వులు చుట్టూ పెట్టాలి. ఇలా చేస్తే అవి విచ్చుకుని అందమే కాక మంచి పరిమళాన్ని వెదజల్లుతాయి.

ఎరుపు, నేరేడు రంగు, ముదురు రంగు పువ్వులు ఒకే చోట కాకుండా మ్యాచింగ్‌ ఉండేలా చూడాలి. పువ్వుల రంగులు గది రంగుకి మ్యాచ్‌ అయ్యే విధంగా పెట్టాలి.

అలాగని మనకు నచ్చరి రంగుల పువ్వులు పెట్టడంకాదు. అలా పెట్టే పువ్వులు ముందుగా మనకు ఆహ్లాదాన్ని కలిగించాలి.

ఫ్లవర్‌వాజ్‌ లోపల, బయట శుభ్రంగా కడిగి అందులో నీరు నింపాలి. నీళ్లలో కాస్తంత ఉప్పు కలిపితే పువ్వులు ఎక్కువ కాలం ఉంటాయి.

ఫ్లవర్‌వాజ్‌ ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నచోట పెట్టుకుండా మంచి గాలి వచ్చే చోట పెట్టాలి. అందువల్ల పూవులు ఎక్కువ సేపు తాజాగా ఉంటాయి.

ఇంట్లో ఇంటోర్‌ ప్లాంట్స్‌, మనీప్లాంట్స్‌ కొన్ని రకాల క్రోటాన్‌ మొక్కలు కుండీలో వేసి గదుల్లో, డ్రాయింగ్‌రూంలో అలంకరించుకోవచ్చు.

ఫ్లవర్‌వాజ్‌ అనేది కేవలం పువ్వులు మాత్రమే బాగుంటే సరిపోదు. పువ్వులు పెట్టే ఫ్లవర్‌వాజ్‌ కూడా అందంగా, ఆకర్షణీయంగా ఉండేలా చూసుకోవాలి.

తాజా తెలంగాణ వార్తల కోసం :https://www.vaartha.com/telangana/