రాహుల్ గాంధీ యాత్రలో ప్రమాదం

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో ప్రమాదం చోటుచేసుకుంది. కర్ణాటకలో బళ్లారిలో న్యూ మోక ప్రాంతంలో యాత్ర కోసం పార్టీ జెండాలను స్తంభానికి కడుతున్న సమయంలో నలుగురికి కరెంట్ షాక్ కొట్టింది. ఒకరు స్తంభానికి జెండా కడుతుండగా.. అది కాస్తా విద్యుత్ లైన్‌కు తగిలింది. దాంతో విద్యుత్ షాక్ తగిలి అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వారంతా బళ్లారి జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

రాహుల్ గాంధీ సమీపంలోనే ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ విషయం తెలిసిన వెంటనే రాహుల్ గాంధీ ఆస్పత్రికి వెళ్లి.. వారిని పరామర్శించారు. గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున పరిహారం ప్రకటించారు. వారికి మెరుగైన వైద్యం అందేలా చేయాలని స్థానిక నాయకులను ఆదేశించారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ రణ్‌దీప్ సింగ్ సుర్జేవాల కూడా రాహుల్ గాంధీతో వెళ్లి.. క్షతగాత్రులను పరామర్శించారు.