గుంటూరులో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

Road accident in guntur
Road accident in guntur

గుంటూరు: జిల్లాలో ఆటో లారీ పరస్పరం ఢీకొన్న ఘటనలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరికొంత మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేపూడి సమీపంలో ఈరోజు ఉదయం ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో, ఎదురుగా వస్తున్న లారీ పరస్పరం ఢీకొట్టడంతో ఈ ఘోరం జరిగింది. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/