ఏపీకి నలుగురు కొత్త ఐపీఎస్‌లు నియమకం

IPS
IPS

అమరావతిః ఏపికి కొత్తగా మరో నలుగురు ఐపీఎస్‌ అధికారుల కేంద్రం కేటాయించింది. హైదరాబాద్‌లోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ నేషనల్‌ పోలీస్‌ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న యువ అధికారులను ఏపీ కేడర్‌కు నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

యుపిఎస్‌సి-2020 బ్యాచ్‌ ఐపీఎస్‌కు ఎంపికైన ఢిల్లీకి చెందిన దీక్ష, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సిహెచ్‌ యశ్వంత్‌కుమార్‌ రెడ్డి, మహారాష్ట్రకు చెందిన ఎస్‌ అంకిత మహవీర్‌, బీహార్‌కు చెందిన నవ్‌ జ్యోతి మిశ్రా అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న మీదట కేంద్రం విడుదల చేసిన ఉత్తర్వుల మేరకు ఏపీకి రానున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/