శ్రీశైలం జలాశయం గేట్ల ఎత్తివేత

ప్రాజెక్టు వద్ద రైతులు, సందర్శకుల కోలాహలం

Srisailam dam
Srisailam dam

హైదరాబాద్‌: శ్రీశైలం ప్రాజెక్టులోకి పూర్తి స్థాయిలోకి నీరు చేరడంతో శుక్రవారం సాయంత్రం శ్రీశైలం గేట్లను ఎత్తి నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేశారు. దీంతో కృష్ణమ్మ నాగార్జున సాగర్‌కు పరుగులు పెట్టింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సుమారు 220 కిలో మీటర్ల మేర కృష్ణానదిలో నీరు నిల్వ ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి 885 అడుగులు కాగా శుక్రవారం నాలుగు గంటల వరకు 880 అడుగులకు చేరుకుంది. 215. 81 టింఎసీల సామర్ధం గల ప్రాజెక్టులో 189.89 టిఎంసీల మేర నీరు నిల్వ ఉంది. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నీటి పారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించి నాలుగు గేట్లను ఎత్తి దిగువనున్న నాగార్జున సాగర్‌కు 1.06 టిఎంసీల నీటిని విడుదల చేశారు. సందర్శకుల కోలాహలం మధ్య, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మంత్రులు సింగిరెడ్డినిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నాగర్‌కర్నూల్ ఎంపి పోతుగంటి రాములు, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డిలు ఈ కార్యక్రమంలో పాల్గొని కృష్ణమ్మకు శ్రీశైలండ్యాంపై పూజలు చేసి కృష్ణాజలాలకు పసుపు కుంకుమ, పూలను సమర్పించుకున్నారు.


తాజా ఇ పేపరు వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://epaper.vaartha.com/