నలుగురు ఇంజినీరింగ్‌ విద్యార్థులు మృతి

road accident
road accident

యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం మైసిరెడ్డిపల్లి శావారులో మంగళవారం(నిన్న) రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ఇంజినీరింగ్‌ విద్యార్థులు స్ఫూర్తి, ప్రణీత, చైతన్య అక్కడికక్కడే మృతిచెందాగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాల‌య్యాయి. ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా వినీత్ రెడ్డి ప్రాణాలు కోల్పోగా.. మ‌నీశ్ రెడ్డి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. వీరంతా కూడా రంగారెడ్డి జిల్లా హ‌య‌త్‌న‌గ‌ర్‌లోని ఓ ఇంజినీరింగ్ క‌ళాశాల‌కు చెందిన విద్యార్థులు బొమ్మ‌ల‌రామారం నుంచి భువ‌న‌గిరి వైపు హోండా కారులో వెళ్తున్నారు. మైసిరెడ్డిప‌ల్లి శివారు మ‌లుపు వ‌ద్ద కారు అదుపుత‌ప్పింది. బొమ్మ‌ల‌రామారంలోని ఓ ప్రైవేట్ గెస్ట్‌హౌజ్‌లో అంద‌రూ క‌లిసి పార్టీ చేసుకున్న‌ట్లు తెలిసింది.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/