జమ్మూకశ్మీర్ లో ఉగ్రకలకలం

ఇద్దరు జవాన్లు, ఇద్దరు సాధారణ పౌరులు మృతి

జమ్మూ కశ్మీర్: జమ్మూ కశ్మీర్ లో మరోసారి ఉగ్ర కలకలం రేగింది. సోపోర్ లో సీఆర్పీఎఫ్, కశ్మీర్ పోలీసుల సంయుక్త బృందంపై ఉగ్రవాదులు గ్రనేడ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు, ఇద్దరు పౌరులు మృతి చెందారు. ఓ పోలీసు సహా ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను సైనిక ఆసుపత్రికి తరలించారు. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ ఈ దాడికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. బారాముల్లా జిల్లాలోని సోపోర్ పట్టణంలో సీఆర్పీఎఫ్, పోలీసు బలగాలను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు. మొదట గ్రనేడ్లు విసిరి, ఆపై కాల్పులు జరిపారు.

కాగా, దాడి సమాచారం తెలిసిన వెంటనే ఉన్నతాధికారులు అదనపు బలగాలను సంఘటన స్థలానికి తరలించారు. అక్కడి మెయిన్ చౌక్ ప్రాంతాన్ని చుట్టుముట్టిన భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టాయి.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/