ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

ఎర్రిగట్టమ్మ గుట్ట వద్ద ప్రమాదం

ములుగు : ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను వ్యాన్ ఢీకొన్న ఘటనలో నలుగురు వ్యక్తులు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లాలోని ఎర్రిగట్టమ్మ వద్ద ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను వరంగల్‌లోని ఎంజీఎంకు తరలించారు.

బాధితులను మంగపేట మండలం కోమటిపల్లి వాసులుగా గుర్తించారు. వీరంతా ఆటోలో అన్నారం షరీఫ్ దర్గాకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. మృతులను అజయ్ (12), కిరణ్ (16), కౌసల్య (60), ఆటో డ్రైవర్ (23)గా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/