ఫిలిపిన్స్‌లో భూకంపం .. నలుగురు మృతి

earthquake-philippines
earthquake-philippines

పిలిపిన్స్‌: ఫిలిపిన్స్‌లో బుధవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. ఫిలిపిన్స్‌కు దక్షిణంగా మిండానావో ప్రాంతంలో ఈ భూకంపం వచ్చిందని అధికారులు తెలిపారు. ఈ భూకంపం కారణంగా నలుగురు చనిపోయారు. మృతి చెందిన వారిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.4గా నమోదైంది. ఇళ్లు కూలిన ఘటనలో ఇద్దరు చిన్నారులు, కొండచరియలు విరిగిపడి ఓ మహిళతో ఆమె ఐదేళ్ల కొడుకు చనిపోయారు. ఈ భూకంపంతో అలర్ట్ ప్రకటించారు. భూకంప తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/