రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్‌ఎస్‌ కార్యాలయాల శంకుస్థాపనలు

TRS
TRS

హైదరాబాద్‌: తెలంగాణలో టిఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయాల భవనాల శంకుస్థాపన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఒకే రోజు 29 చోట్ల శంకుస్థాపనలు చేశారు. సిరిసిల్లలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కేటిఆర్‌ పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. టిఆర్‌ఎస్‌ కార్యాలయాలు ఇప్పటికే ఖమ్మం, వనపర్తి జిల్లాల్లో ఉన్నాయి. మొత్తం 33 జిల్లాల్లోనూ కార్యాలయాలుండాలని పార్టీ అధ్యక్షుడు, సియం కేసిఆర్‌ నిర్ణయించారు. ఖమ్మం, వనపర్తి మినహా మిగిలిన 29 జిల్లాల్లో ఈ రోజు శంకుస్థాపన కార్యక్రమాలు జరిగాయి. ఒక్కో జిల్లా కార్యాలయానికి రూ. 60 లక్షల చొప్పున పార్టీ అధిష్టానం కేటాయించింది. అన్ని కార్యాలయాలు ఒకే నమూనాతో నిర్మించనున్నారు.

తాజా హీరోయిన్‌ల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actress/