నూతన శాసనసభ నిర్మాణానికి కేసిఆర్‌ శంకుస్థాపన

KCR
KCR, telangana cm

హైదరాబాద్‌: నూతన శాసనసభ భవన నిర్మాణానికి తెలంగాణ సియం కేసిఆర్‌ గురువారం ఉదయం భూమిపూజ చేశారు. నగరంలోని ఎర్రమంజిల్‌లో రూ. 100కోట్లతో శాసనసభ, మండలి, సెంట్రల్‌ హాల్‌లను నిర్మించనున్నారు. ఎర్రమంజిల్‌లోని రోడ్లు, భవనాల శాఖ సముదాయాన్ని ఎంపిక చేశారు. భూమిపూజ కార్యక్రమంలో సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్‌, ఈటల రాజేందర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, ఎంపి కేశవరావు, హరీశ్‌రావు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/