కర్తార్‌పూర్‌ కారిడార్‌ శంకుస్థాపన

imran khan
imran khan

కర్తార్‌పూర్‌: కర్తార్‌పూర్‌ కారిడార్‌కు ఇవాళ పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ శంకుస్థాపన చేశారు. సిక్కుల పవిత్ర స్థలమైన దర్బార్‌ సాహిబ్‌ అక్కడ ఉన్నది. పంజాబ్‌లోని బోర్డర్‌ సమీపంలో ఉన్న కారిడార్‌ ప్రారంభోత్సవానికి ,భారత్‌ నుంచి మంత్రి హర్‌సిమ్రత్‌ కౌర్‌తో పాటు మాజీ క్రికెటర్‌ సిద్ధూ వెళ్లారు. గురుద్వారా దర్బార్‌ సాహిబ్‌కు ఇక నుంచి సిక్కులు ఎటువంటి వీసా లేకుండా వెళ్లవచ్చు. వచ్చే ఏడాది జరగనున్న 550 వ బాబా గురు ప్రాజెక్టును పూర్తి చేయనున్నారు. కర్తార్‌పూర్‌ గురుద్వారాను అత్యద్భుత గురు ద్వారాగా తీర్చిదిద్దుతామని పాక్‌ చెప్పింది. వచ్చే ఏడాది గురు నానక్‌ జయంతిని అత్యంత ఘనంగా నిర్వహిస్తామని పాక్‌ ప్రభుత్వం వెల్లడించింది. ఈ సందర్భంగా ఇమ్రాన్‌ మాట్లాడుతూ..భారత్‌తో పాక్‌ నాగరిక సంబంధాలు నెరపాలని చూస్తున్నదని అన్నారు.