వైఎస్‌ఆర్‌సిపిలో చేరిన పంచకర్ల రమేశ్ బాబు

పార్టీలోకి ఆహ్వానించిన సిఎం జగన్‌

panchakarla-ramesh-babu-joins-ysrcp

అమరావతి: టిడిపి నేత, మాజీ శాసనసభ్యుడు పంచకర్ల రమేశ్ బాబు వైఎస్‌ఆర్‌సిపి తీర్థం పుచ్చుకున్నారు. ఈరోజు సిఎం క్యాంపు కార్యాలయంలో సిఎం సమక్షంలో వైఎస్‌ఆర్‌సిపి కండువా కప్పుకున్నారు. రమేశ్ బాబుకు సిఎం జగన్ పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సిఎం క్యాంపు కార్యాలయానికి ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్ తదితరులు కూడా విచ్చేశారు.

రమేశ్ బాబు 2009లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయ రంగప్రవేశం చేశారు. ప్రజారాజ్యం తరఫున పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడంతో గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాస్ లతో పాటు పంచకర్ల కూడా టిడిపిలో చేరారు. 2014 ఎన్నికల్లో యలమంచిలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2019 ఎన్నికల్లో ఆయనకు వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్థి కన్నబాబురాజు చేతిలో పరాజయం ఎదురైంది. అప్పటినుంచి టిడిపి కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/