వైస్సార్సీపీ గూటికి టీడీపీ మాజీ ఎమ్మెల్యే

ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే టీడీపీ ని వీడి జగన్ సమక్షంలో వైస్సార్సీపీ లో చేరారు. చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవీ శ్రీనాథ్‌ రెడ్డి గురువారం జగన్ సమక్షంలో.. వైస్సార్సీపీ పార్టీ కండువా కప్పుకున్నారు. శ్రీనాథ్ రెడ్డితో పాటు పీలేరు నియోజకవర్గ టీడీపీ నేతలు జీవి రాకేష్‌ రెడ్డి, ఎం.వెంకట కృష్ణారెడ్డి, వి.ఉమాకాంత్‌ రెడ్డి, బి.నరేందర్‌ రెడ్డి, జి.నరేష్‌కుమార్‌ రెడ్డి లు వైస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు.

వీరి చేరికతో రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి, పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మైనారిటీస్‌ కమిషన్‌ ఛైర్మన్‌ ఇక్బాల్‌ అహ్మద్‌ ఖాన్‌.. జీవీ శ్రీనాథ్‌ రెడ్డి చేరికలో కీలక పాత్ర పోషించారు. శ్రీనాధ్ టీడీపీ ని వీడడానికి కారణం…మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి సోదరుడు.. నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డి టీడీపీలో చేరడమే అని ప్రచారం జరుగుతుంది. 2024 ఎన్నికల్లో పీలేరు నుంచి కిషోర్‌కుమార్ రెడ్డిని టీడీపీ బరిలోకి దింపుతారనే ప్రచారం సాగుతోంది. దీంతో తీవ్ర ఆగ్రహంగా ఉన్న జీవీ శ్రీనాథ్ రెడ్డి టీడీపీ కి గుడ్ బై చెప్పి..వైస్సార్సీపీ కి మద్దతు పలికారు. దీంతో పీలేరులో వైస్సార్సీపీ కి బలం మరింత పెరుగుతుందనే చర్చ జరుగుతోంది.