ఆర్థిక దుబారా వల్ల సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉంది

duvvuri subbarao
duvvuri subbarao

ముంబయి: ఆర్థిక దుబారా వల్ల సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు హెచ్చారించారు. ఆయన నిన్న టైమ్స్‌ నెట్‌ వర్క్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్థిక సదస్సులో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ద్రవ్వలోటు లక్ష్యాలకు కట్టుబడి ఉండాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. నిర్ణీత స్థాయిలోనే ద్రవ్యలోటును కట్టడి చేయాలని లేదంటే సంక్షోభం తప్పదన్నారు. 1991లో చెల్లింపుల సంక్షోభం ఎదురైందని, 2013లో రూపాయి మారకం రూపంలో ప్రమాదం వచ్చి పడిందని, ఇవన్నీ రావడానికి ఆర్థిక దుబారానే కారణమన్నారు. అందువల్ల ద్రవ్వలోటు లక్ష్యంలోపు ఉండేలా చర్యలు తీసుకోవాలని మోడి ప్రభుత్వానికి హితవు పలికారు దువ్వూరి. మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వాలు రుణాలు మంజూరు చేయడం సరైన చర్య అన్నారు. అయితే మరింత తక్షణ అవసరాల కోసం కనుక రుణాలు చేసే పరిస్థితి వచ్చిందంటే ఆర్థిక వ్యవస్థకు మరింత నష్టం వాటిల్లుతుందన్నారు.

తాజా ఎపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/