ముగిసిన ప్రణబ్‌ అంత్యక్రియలు

ముగిసిన ప్రణబ్‌ అంత్యక్రియలు
Pranab Mukherjee death last rites

న్యూఢిల్లీ: భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. సైనిక లాంఛ‌నాల‌తో ప్ర‌ణ‌బ్ అంతిమ సంస్కారాల‌ను నిర్వ‌హించారు. కొవిడ్ నిబంధ‌న‌ల ప్ర‌కారం ప్ర‌ణ‌బ్ అంత్య‌క్రియ‌లు పూర్తి చేశారు. ప్ర‌ణ‌బ్ అంత్య‌క్రియ‌ల‌ను ఆయ‌న కుమారుడు అభిజిత్ ముఖ‌ర్జీ నిర్వ‌హించారు. కొవిడ్ నేప‌థ్యంలో గ‌న్ క్యారేజ్ పై కాకుండా సాధార‌ణ అంబులెన్స్‌లో ప్ర‌ణ‌బ్ అంతిమ‌యాత్ర కొన‌సాగింది. అశ్రున‌య‌నాల మ‌ధ్య దాదాకు క‌న్నీటి వీడ్కోలు ప‌లికారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/