పాక్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కు బెయిల్‌

అనారోగ్యం దృష్టా పాకిస్థాన్ కోర్టు బెయిల్ మంజూరు

Nawaz-Sharif
Nawaz-Sharif

లాహోర్: జైలు శిక్ష అనుభవిస్తున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అనారోగ్యం దృష్టా పాకిస్థాన్ కోర్టు శుక్రవారం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. రోగనిరోధక శక్తిని కోల్పోయిన షరీఫ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ప్లేట్‌లెట్‌లు పడిపోయి తీవ్ర అస్వస్థతకు గురైన పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్ (పిఎంఎల్ ఎన్) అధినేతను సోమవారం రాత్రి వెంటనే నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో నుంచి లాహోర్‌లోని సర్వీసెస్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. తన అన్నగారిని విడుదల చేయమని కోరుతూ షరీఫ్ సోదరుడు షాబాజ్ షరీఫ్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఇద్దరు న్యాయమూర్తుల లాహోర్ హైకోర్టు ధర్మాసనం విచారించి నవాజ్‌కు బెయిల్ మంజూరు చేసింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/