ఈనెల 11న ఢిల్లీలో నిరాహార దీక్ష చేయనున్న విహెచ్‌!

V Hanumantha Rao
V Hanumantha Rao

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపి వి. హనుమంతరావు ఈనెల 11వ తేదీన ఢిల్లీలో నిరాహార దీక్షకు సిద్ధమవుతున్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతు 11 వ తేదీన జంతర్‌ మంతర్‌లో నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు ప్రకటించారు. పంజాగుట్టలోని అంబేద్కర్‌ విగ్రహానికి జరిగిన అన్యాయంపై దీక్ష చేస్తున్నానని, అసలు అంబేద్కర్‌ విగ్రహ ఏర్పాటును సిఎం కెసిఆర్‌ ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. ఎన్నికల కోడ్‌ పేరుతో అంబేద్కర్‌ విగహాన్ని లాకప్‌ లో ఉంచడం దారుణమైన విషయమని ఆవేదన చెందారు. పంజాగుట్ట చౌరస్తాలో అంబేద్కర్‌ విగ్రహాన్ని మళ్లీ ప్రతిష్టించాల్సిందేనని విహెచ్‌ డిమాండ్‌ చేశారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/