శాసన మండలికి నామినేషన్ వేసిన కవిత

నామినేషన్‌ వేసేందుకు వెళ్తుండగా..తుప్రాన్‌ వద్ద ప్రమాదం ధ్వంసమైన జీవన్‌రెడ్డి కారు

kalvakuntla-kavitha
kalvakuntla-kavitha

హైదరాబాద్‌: కల్వకుంట్ల కవిత నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి టిఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. కాగా నామినేషన్ వేయడానికి వెళ్తుంగా ఆమె కాన్వాయ్‌లో ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి నిజామాబాద్‌ వెళ్తుండగా కాన్వాయ్‌ తుప్రాన్‌ వద్దకు చేరుకోగానే ముందు వెళ్తున్న ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కారును కాన్వాయ్‌లోని మరో కారు ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆ ఎమ్మెల్యే కారు ధ్వంసమైంది. జీవన్‌రెడ్డి అందులో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. తాను క్షేమంగానే ఉన్నానని జీవన్‌ రెడ్డి తెలిపారు. ఈ ఘటన జరిగిన అనంతరం నిజామాబాద్‌ చేరుకున్న కవిత నామినేషన్‌ దాఖలు చేశారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/