జేసి దివాకర్‌ రెడ్డి అరెస్ట్‌

JC Divakar Reddy
JC Divakar Reddy

అనంతపురం: భూ వివాదంలో టిడిపి మాజీ ఎంపి జేసి దివాకర్‌ రెడ్డిని అరెస్ట్‌ చేశారని సమాచారం. కాగా వివరాల్లోకి వెలితే.. గత కొద్ది రోజులుగా వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తలకు, టిడిపి కార్యకర్తలకు మధ్య ఇంటి స్థలంపై సమస్య వివాదానికి దారి తీసింది. కాగా ఈ స్థలం తనదని వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్త వెంకట్రామిరెడ్డి సరిహద్దును ఏర్పాటు చేయగా, అడ్డుకునేందుకు జేసి బుక్కరాయ సముద్రం మండలం వెంకటాపురం వెళ్లే ప్రయత్నంలో అరెస్టు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులతో ఆయన నన్నెందుకు అరెస్ట్‌ చేస్తున్నారంటూ వాదనకు దిగారని, ఆయనతో పాటు యామిని బాల, బీటి నాయుడుని కూడా అరెస్ట్‌ చేశామని, అరగంట తరువాత వారిని ఇంటి వద్ద వదిలేశామని అధికారులు పేర్కొన్నారు. కాగా మరోవైపు టిడిపి నేతలు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని శింగనమల ఎమ్మెల్యె జొన్నలగడ్డ పద్మావతి ఆరోపించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/