అధిష్టానం ఫై మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ అసంతృప్తి

కాంగ్రెస్ అధిష్టానం ఏపీలో పార్టీ కమిటీ సభ్యుల విషయంలో కీలక మార్పులు చేసిన సంగతి తెలిసిందే. కొత్త పీసీసీ అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు ను నియమించడం తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మస్తాన్ వలీ, జంగా గౌతమ్, సుంకర పద్మశ్రీ, రాకేశ్ రెడ్డిలను అధిష్టానం నియమించింది. ఇప్పుడున్న శైలజానాథ్‌ ను పీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పించి.. ఆయన స్థానంలో రుద్రరాజుకు అవకాశం ఇచ్చింది. 18 మందితో పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీతో పాటు 34 మందితో కో ఆర్డినేషన్‌ కమిటీని నియమిస్తూ.. ఏఐసీసీ బుధవారం రాత్రి ప్రకటన విడుదల చేసింది. ఈ క్రమంలో మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ అధిష్టానం తీరుపట్ల అసంతృప్తి వ్యక్తం చేసారు. తనకు ఇచ్చిన క్యాంపెయిన్ కమిటీ ఛైర్మన్ పదవిని వద్దంటూ అధిష్టానానికి తిరస్కరణ లేఖ పంపించారు.

ప్రస్తుతం ఏపీలో అన్ని రాజకీయపార్టీల అధ్యక్షులు అగ్ర కులాల వారే ఉన్నారని.. వైఎస్సార్‌సీపీకి రెడ్డి సామాజికవర్గం.. టీడీపీకి కమ్మ, జనసేన పార్టీకి కాపు, బీజేపీకి కాపు, సీపీఎంకు రెడ్డి, సీపీఐకి బీసీలు అధ్యక్షులుగా ఉన్నారని.. ఇప్పుడు కాంగ్రెస్ ఏపీ అధ్యక్ష పదవి కూడా బ్రాహ్మణ వర్గానికి ఇచ్చారన్నారు. ప్రచార కమిటీ చైర్మన్ పదవిని అగ్రవర్ణాల వారికి ఇస్తే కాంగ్రెస్ బలపడుతుందని హర్షకుమార్ చెప్పుకొచ్చారు. అలాగే కాంగ్రెస్ పార్టీలో తానుక సామానయ కార్యకర్తగానే కొనసాగుతానని తెలిపారు.