జే ట్యాక్స్‌ పేరుతో టిడిపి నేతలు తప్పుడు ప్రచారం

గత ప్రభుత్వ హయంలో టిడిపి నేతలు ఎంతెంత ముడుపులు తీసుకున్నారో బయటపెడతా

sa rahman
sa rahman

విశాఖపట్టణం: జే ట్యాక్స్‌ పేరుతో టిడిపి నేతలు మరోసారి విమర్శిస్తే..గత ప్రభుత్వంలో టిడిపి నేతలు ఎంతెంత ముడుపులు తీసుకున్నారో లెక్కలతో సహ బయటపెడతానని మాజీ ఎమ్మెల్యే, వుడా మాజీ చైర్మన్‌ రెహమన్‌ హెచ్చరించారు. గురువారం ఆయన మీడియతో మాట్లాడుతూ..రాష్ట్రంలో మంచి పరిపాలన జరుగుతుంటే జే ట్యాక్స్‌ పేరుతో టిడిపి తప్పుడు ప్రచారం చేస్తుందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో కొన్ని బ్రేవరేజెస్‌కి మాత్రమే అనుమతిలిచ్చింది నిజం కాదా.. అని రూ.600 కోట్లు ముడుపులు తీసుకున్నారని ఆ రోజు అసెంబ్లీలో మైసురారెడ్డి ఆరోపణలు వాస్తవం కాదా? అని రెహమన్‌ ప్రశ్నించారు. ఇంకా ఎన్‌పీఆర్‌, ఎన్‌ఆర్‌సీలతో మైనార్టీలు అభద్రత భావానికి గురవుతున్నారని ఎన్‌ఆర్‌సీ అమలు కాకుండా కేంద్రంతో మాట్లాడతానని..అవసరమైతే అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రకటించడం అభినందనీయమన్నారు. కొందరు నేతలు ట్విట్టర్‌కి మాత్రమే అలవాటు పడ్డారని..ప్రజల్లోకి రాలేకపోతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/