చింతమనేని న్యాయవాది అరెస్టు

Chintamaneni Prabhakar
Chintamaneni Prabhakar

ఏలూరు: దెందులూరు మాజీ ఎమ్మెల్యె, టిడిపి టీడీపీ నాయకుడు చింతమనేని ప్రభాకర్‌ను నిన్న అరెస్టు చేసిన ఏపీ పోలీసులు ఈరోజు ఆయన న్యాయవాదిని కూడా అరెస్టు చేశారు. చింతమనేని అరెస్టు సందర్భంగా ఆయన ఇంటి వద్ద గస్తీ కోసం వెళ్లిన మహిళా పోలీసు సిబ్బందిని నిర్బంధించి విధులకు ఆటంకం కలిగించారని చింతమనేని న్యాయవాది శ్రీనివాసబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో న్యాయవాది ఇంటికి భారీగా చేరుకున్న పోలీసులు శ్రీనివాసబాబును అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా చిన్నపాటి ఉద్రిక్తత చోటు చేసుకుంది. దళితులను దూషించిన కేసులో అరెస్టయిన చింతమనేనికి కోర్టు ఈనెల 25వ తేదీ వరకు రిమాండ్‌ విధించడంతో ఆయనను జైలుకు తరలించిన విషయం తెలిసిందే.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/