కాపుల గురించి మాట్లాడే అర్హత ప‌వ‌న్‌కు లేదు – కురసాల కన్నబాబు

కాపుల గురించి మాట్లాడే అర్హత జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు లేదన్నారు మాజీ మంత్రి కురసాల కన్నబాబు. మంగళవారం పార్టీ ఆఫీస్ జనసేనాధినేత పవన్ కళ్యాణ్ వైస్సార్సీపీ నేతలపై చేసిన కామెంట్స్ , చంద్రబాబు..పవన్ తో భేటీ కావడం తో రాష్ట్రం వ్యాప్తంగా చర్చ కు దారితీసాయి. పవన్ కళ్యాణ్ కామెంట్స్ ఫై , చంద్రబాబు కలవడం ఫై జనసేన కార్య కర్తలు , నేతలు , టిడిపి శ్రేణులు పాజిటివ్ గా స్పందిస్తుంటే..వైస్సార్సీపీ నేతలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కామెంట్స్ కు ఘాటుగా స్పందిస్తున్నారు. ఇప్పటీకే పలువురు వైస్సార్సీపీ నేతలు దీనిపై స్పందించగా, తాజాగా మాజీ మంత్రి కురసాల కన్నబాబు పవన్ ఫై ఘాటైన వ్యాఖ్యలే చేసారు.

కాపుల గురించి మాట్లాడే అర్హత పవన్‌కు ఉందా? ఆయన తన పక్కన కమ్మ సామాజికవర్గానికి చెందిన నాదెండ్ల మనోహర్‌ను కూర్చోబెట్టుకున్నాడు. ఆ పార్టీలో ఏ కాపు నాయకులకూ కనీసం కుర్చీ వేయలేదు. ప‌వ‌న్‌ పక్కన కూర్చోవడానికే కాపులకు అర్హత లేదు. అలాంటప్పుడు నువ్వు కాపులను ఎలా ఉద్దరిస్తావు ప‌వ‌న్‌..? నీ పార్టీకి కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్, నిర్మాత ఎవరెవరో అందరికి తెలుసు. రంగా హత్యకు బాధ్యుడు ఎవరో తెలుసా..? ఆనాటి హోంమంత్రి హరిరామజోగయ్య రాసిన పుస్తకంలో చంద్రబాబే రంగ హత్యకు బాధ్యులు అని రాశారు.. అదే చంద్రబాబు చంకలో కూర్చొని రంగా దారుణ హత్య గురించి కన్నీళ్లు కారుస్తావా? అని ప్రశ్నించారు.

ఇన్నాళ్లూ ర‌హ‌స్యంగా సాగిన చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ల బంధం అని, ఈరోజు ముసుగు తీసి ప్రేమ‌ప‌క్షులు రెండూ ఒక్క‌ట‌య్యాయ‌ని అన్నారు. ఇద్దరూ కలిసి కాపురం చేయడానికి ఇంత సీన్‌ సృష్టించాలా అని నిలదీశారు. చంద్ర‌బాబును ముఖ్య‌మంత్రిని చేయ‌డానికి ప‌వ‌న్ ఆరాటప‌డుతున్నాడని ప్ర‌జ‌ల‌కు అర్థ‌మైపోయింద‌న్నారు. చంద్ర‌బాబుతో పొత్తు కోస‌మే ప‌వ‌న్ క‌ల్యాణ్ హైడ్రామా న‌డిపాడ‌న్నారు.