మాజీ మంత్రి కొమ్మారెడ్డి సురేందర్‌ రెడ్డి మృతి

మాజీ మంత్రి కొమ్మారెడ్డి సురేందర్‌ రెడ్డి మృతి
Surendar Reddy (File)

హైదరాబాద్‌: తెలంగాణకు చెందిన మాజీ మంత్రి కొమ్మారెడ్డి సురేందర్‌ రెడ్డి ఇవాళ మృతి చెందారు. దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న ఆయన యశోదా ఆసుపత్రిలో అనారోగ్యానికి చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో మరణించారు. కొంతకాలంగా ఆయన మాదాపూర్ లోని తన కుమార్తె నివాసంలో ఉంటున్నారు. నాడు ఎన్‌టిఆర్‌ హయాంలో కొమ్మారెడ్డి సురేందర్‌ రెడ్డి మంత్రిగా పనిచేశారు. అప్పట్లో మేడ్చెల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యెగా గెలుపొంది అటవీశాఖ మంత్రిగా పనిచేశారు. సురేందర్ రెడ్డి మృతి పట్ల టిడిపి, ఇతర పార్టీల నేతలు సంతాపం తెలియజేశారు. సురేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులు విదేశాల్లో ఉండడంతో అంత్యక్రియలు రేపు నిర్వహించనున్నారు. కొమ్మారెడ్డి మృతికి సిఎం కెసిఆర్‌ విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు సంతాపం తెలిపారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/