హైకోర్టు వల్ల నీళ్లు, ఉద్యోగాలు లభిస్తాయా?

మాజీ మంత్రి అఖిలప్రియ వ్యాఖ్యలు

bhuma akhila priya
bhuma akhila priya

ఆళ్ళగడ్డ(కర్నూలు): ఏపికి మూడు రాజధానుల అంశంపై టిడిపి మాజీ మంత్రి అభిలప్రియ స్పందిచారు. హైకోర్టును రాయలసీమకు తెచ్చినంత మాత్రాన నీళ్లు, ఉద్యోగాలు వస్తాయా? అని ఆమె ప్రశ్నించారు. హైకోర్టును మంజూరు చేసి సీమను ఉద్దరించామని చెప్పుకోవద్దని, సీమ ప్రజలకు కావాల్సింది నీళ్లు, పరిశ్రమలని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. సిఎం జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే టిడిపి ప్రవేశ పెట్టిన అభివృద్ధి పథకాలను కొనసాగించాలని ఆమె సూచించారు. అంతేకాకుండా రాష్ట్ర రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని కూడా ఆమె సలహా ఇచ్చారు. అర్థంపర్థం లేని నిర్ణయాలు తీసుకుని ప్రజలతో ఆడుకోవడం జగన్‌ సర్కారుకు తగదని, పాలనను సక్రమంగా కొనసాగించట్లేదని అఖిలప్రియ తీవ్ర స్థాయిలో విమర్శించారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/