కస్టడి డెత్ కేసులో మాజీ ఐపిఎస్‌కు యావజ్జీవం

జామ్‌నగర్:గుజరాత్‌కు చెందిన మాజీ ఐపీఎస్ ఆఫీసర్ సంజీవ్ భట్‌కు పోలీసు కస్టడీ డెత్ కేసులో యావజ్జీవ శిక్ష పడింది. జామ్‌నగర్ కోర్టు ఇవాళ ఈ తీర్పును వెలువరించింది. అయితే ఇదే కేసులో దోషులుగా తేలిన మరో ఆరుగురు పోలీసులకు ఇంకా శిక్షను ఖరారు చేయాల్సి ఉంది. 1989లో కస్టడీ డెత్ ఘటన చోటుచేసుకున్నది. జామ్‌నగర్ జిల్లాలో ఏసీపీగా సంజీవ్ భట్ ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో జరిగిన అల్లర్లలో జోద్పూర్ పట్టణంలో 150 మందిని ఏసీపీ సంజీవ్ అరెస్టు చేశారు. అయితే ప్రభుదాస్ వైష్ణాని అనే వ్యక్తి కస్టడీలో చనిపోయారు. ప్రభుదాస్ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేశారు.