ఇదే సరైన అవకాశం, నిరూపించుకో

dhawan, pant, sachin
dhawan, pant, sachin

లండన్‌: ప్రపంచకప్‌ నుంచి గాయం కారణంగా నిష్క్రమించిన టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ధావన్‌కు క్రికెట్‌ లెజెండ్‌ సచిన్‌ టెండూల్కర్‌ భావోద్వేగపూరిత సందేశం ఇచ్చాడు. శిఖర్‌ నీ గురించి చింతిస్తున్నాను. బాగా ఆడుతున్న సమయంలో ఇలాంటి పెద్ద టోర్నమెంటులో గాయం కారణంగా నిష్క్రమించావు. ఇది చాలా బాధాకరమైన విషయం, నువ్వు గతంలో కంటే మరింత ధృడంగా తిరిగి వస్తావని ఆశిస్తున్నా అంటూ సచిన్‌ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా యువ క్రికెటర్‌ రిషబ్‌పంత్‌కు ఇది సరైన అవకాశం అని, పంత్‌ను ఉద్దేశిస్తూ బాగా ఆడుతున్నాడని మెచ్చుకున్నాడు. నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి ఇంతకన్నా పెద్ద అవకాశం మరొకటి ఉండదని సచిన్‌ తెలిపాడు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/