భారత మహిళా క్రికెట్‌ జట్టుకు స్పిన్‌ కన్సల్టెంట్‌ నియామకం

Narendra Hirwani
Narendra Hirwani

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌కు చెందిన మాజీ లెగ్‌ స్పిన్నర్‌, జాతీయ క్రికెట్‌ అకాడమి(ఎన్‌సిఏ)స్పిన్‌ కోచ్‌ నరేంద్ర హిర్వాని భారత మహిళా జట్టుకు స్పిన్‌ కన్సల్టెంట్‌గా వ్యవహరించనున్నారు. భారత్‌ తరఫున 17 టెస్టులు, 18 వన్డేలు ఆడిన హిర్వాని సెప్టెంబరులో దక్షిణాఫ్రికాతో జరిగే హోమ్‌ సిరీస్‌తో మహిళా జట్టుతో కలవనున్నారు.
ప్రస్తుతం భారత మహిళా జట్టులో చాలామంది స్పిన్నర్లు ఉన్నారు. పూనమ్‌ యాదవ్‌, ఏక్తా బిష్ట్‌, దీప్తి శర్మలతో జట్టు స్పిన్నర్లతో నిండిఉంది. ఈ నేపథ్యంలో టీమిండియాకు స్పిన్‌ కోచ్‌ అవసరం అని తాజాగా భారత టీ20 కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ అన్నారు. ఇది పరిగణలోకి తీసుకున్న బిసిసిఐ నరేంద్ర హిర్వానిని స్పిన్‌ కన్సల్టెంట్‌గా ఎంపిక చేసింది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/