హర్యానా మాజీ మంత్రి కమలా వర్మ కన్నుమూత
Former Haryana Minister And BJP Leader Kamal Verma Dies At 93
యమునానగర్ : హర్యానా మాజీ మంత్రి, ప్రముఖ బీజేపీ నాయకురాలు కమలా వర్మ (93) కన్నుమూశారు. కరోనా బారినపడి కోలుకున్న అనంతరం.. ఆమె మ్యూకోమైకోసిస్ (బ్లాక్ ఫంగస్) బారినపడ్డారు. ఈ క్రమంలో ప్రైవేటులో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా మంగళవారం ఆరోగ్య పరిస్థితి విషమించి రాత్రి మరణించినట్లు ఆసుపత్రి వైద్యుడు తెలిపారు. కమలా వర్మ మృతిపై హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ సంతాపం తెలిపారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/