దావూద్‌ ఇబ్రహీం అనుచరుని మృతి

దావూద్‌ ఇబ్రహీం అనుచరుని మృతి


ముంబై: అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం ముఖ్య అనుచరుడు షకీల్‌ అహ్మద్‌ షేక్‌ గుండెపోటుతో ముంబైలోని జస్లోక్‌ ఆసుపత్రిలో మృతి చెందాడు. షేక్‌ అలియాస్‌ లంబు షకీల్‌ గత కొంతకాలంగా గుండెజబ్బుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ముంబై పేలుళ్ల కేసులో దావూద్‌తోపాటు లంబూ కీలక నిందితుడు. దావూద్‌ పాక్‌ వెళ్లి తలదాచుకోగా అతని అనుచరులు మాత్రం ముంబైలోనే ఉంటున్నారు. సోమవారం ముఖ్య అనుచరుడు షకీల్‌ మరణించాడు.