4వేల మాస్కుల అందజేత

టీమిండియా మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్‌ పఠాన్‌, యూసుఫ్‌ పఠాన్‌ విరాళం

Former cricketers Irfan Pathan and Yusuf Pathan

టీమిండియా మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్‌ పఠాన్‌, అతని సోదరుడు యూసుఫ్‌ పఠాన్‌ సుమారు 4వేల మాస్కులను విరాళంగా ఇచ్చారు. కోవిడ్‌ 19 వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు అవసరమైనవారికి 4వేల మాస్కులను ఉచితంగా అందించారు.

29టెస్టులు, 120వన్డేలు ఆడిన భారత మాజీస్పీడ్‌ స్టర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజం కోసం తమ వంతు కృషిచేస్తున్నట్టు తెలిపాడు.

యువతరంఏమైనా చేయాలనుకుంటే దయచేసి ముందుకురావాలని అయితే ఎక్కడా గుమికూడవద్దని ట్వీట్‌ చేశాడు. పారిశుద్ధ్యానికి సంబంధించి ఒకిరికి ఒకరు సాయం చేసుకోవాలని సూచించాడు.

అయితే ఈ క్రమంలో జనసమీకరణ చేపట్టవద్దని సూచించాడు. తాము చేస్తున్న సాయం ప్రారంభం మాత్రమేనని తాము మరింత సహాయం చేస్తూనే ఉంటామని తెలిపాడు.

తనతోపాటు తన సోదరుడు, తండ్రి నిర్వహిస్తున్న మొహమూద్‌ఖాన్‌ పఠాన్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ పేరిట మాస్కులు కొన్నామని వీటిని వడోదర ఆరోగ్యశాఖకు పంపిస్తామని వీడియో సమాచారంలో తెలిపాడు

. కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం భారత్‌లో కోవిడ్‌ 19 కేసుల సంఖ్య 430కు దాటిందని తెలిపాడు. ప్రపంచవ్యాప్తంగా 3,50,000 కరోనా కేసులు నిర్ధారణ అవగా మరణించినవారిసంఖ్య 15వేలు దాటింది.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/nri/