రాజ్యసభకు జస్టిస్‌ రంజన్‌ గొగొయి

నామినేట్‌ చేసిన రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌

Ranjan Gogoi
Ranjan Gogoi

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ రంజన్‌ గొగొయిని రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌ రాజ్యసభకు నామినేట్‌ చేశారు. ‘ఒక నామినేటెడ్‌ సభ్యుడి పదవీ విరమణ కారణంగా ఏర్పడిన స్థానాన్ని రంజన్‌ గొగోయ్ తో రాష్ట్రపతి భర్తీ చేశారు’ అని ప్రభుత్వ అధికారిక నోటిఫికేషన్‌ పేర్కొంది. ఇప్పటివరకూ ఈశాన్య రాష్ట్రాల నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించే స్థాయికి ఎదిగినది ఆయన ఒక్కరే. ఆయన పదవీ కాలంలో చివరిగా ఇచ్చిన తీర్పులు వివాదాస్పదమయ్యాయి. గత ఏడాది నవంబరు 17న ఆయన పదవీ విరమణ చేశారు. రాజకీయంగా, మతపరంగా దశాబ్దాల తరబడి పరిష్కారం కాని బాబ్రీ మసీదురామజన్మభూమి అంశంపై ఆయన నేతృత్వంలోని బెంచ్‌ ఇచ్చిన తీర్పు వివాదాస్పదమైంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/