మాజీ సిఎం అజిత్‌ జోగి కన్నుమూత

ఛత్తీస్‌గఢ్ తొలి సీఎంగా పనిచేసిన అజిత్‌ జోగి

Former Chhattisgarh CM Ajit Jogi

రాయపూర్‌: ఛత్తీస్‌గఢ్‌ మాజీ సిఎం అజిత్ జోగి ( 74) కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన రాయపూర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతు తుదిశ్వాస విడిచారు. అజిత్ జోగి మరణ వార్తను ఆయన కుమారుడు అమిత్ జోగి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 20 ఏళ్ల వయసున్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కుటుంబ పెద్దను కోల్పోయిందని ట్విట్టర్ లో ఆయన వ్యాఖానించారు. తానే కాకుండా, రాష్ట్ర ప్రజలందరూ ఒక తండ్రిని కోల్పోయారని చెప్పారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అజిత్ జోగి గత వారం రోజుల వ్యవధిలోనే రెండు సార్లు కార్డియాక్ అరెస్ట్ కు గురయ్యారు. మూడు వారాలుగా ఆయన ఆసుపత్రిలోనే ఉన్నారు. 2000వ సంవత్సరంలో అవతరించిన ఛత్తీస్‌గఢ్ తొలి ముఖ్యమంత్రిగా అజిత్ జోగి చరిత్ర పుటల్లో నిలిచిపోయారు. 2016లో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన ఆయన జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ అనే సొంత పార్టీని స్థాపించారు.

తాజా తెలంగాణ వార్తల కసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/