టిడిపి తీర్ధం పుచ్చుకున్న అశోక్‌బాబు

ashok babu
ashok babu, former ap ngo’spresident


అమరావతి: ఏపిఎన్జీవో సంఘ మాజీ అధ్యక్షుడు అశోక్‌బాబు సియం చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరారు. అశోక్‌బాబుకు పార్టీ కండువా కప్పి చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు. టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ఎంపిక చేసినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినందుకు శమంతకమణి సియంను కలిసి ధన్యవాదాలు చెప్పారు.