ఏపీలో కొత్త జిల్లాల అవ‌త‌ర‌ణ‌కు ముహూర్తం ఖ‌రారు..

ఏప్రిల్ 4న కొత్త జిల్లాల ఏర్పాటు

అమరావతి: ఏపీలో కొత్త జిల్లాల అవ‌త‌ర‌ణ‌కు ముహూర్తం ఖ‌రారు అయింది. ఏప్రిల్ 4న కొత్త జిల్లాల ప్ర‌క‌ట‌న చేయ‌నుంది ఏపీ స‌ర్కార్. ఏప్రిల్ 4న ఉ.9-05నుంచి, 9-45మ‌ధ్య కొత్త జిల్లాల అవ‌త‌ర‌ణ‌.. ఆంధ్రప్రదేశ్‌లో నూతన జిల్లాల ఏర్పాటు తేదీని రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. సీఎం జ‌గ‌న్ చేతుల మీదుగా కొత్త జిల్లాల ప్రారంభోత్స‌వం జ‌ర‌గ‌నుంది. 26జిల్లాల‌కు ఆమోదం తెలిసింది కేబినెట్. వ‌ర్చువ‌ల్ గా ఆమోద‌ముద్ర వేసింది మంత్రివ‌ర్గం. కొత్త జిల్లాల ఏర్పాటులో విషయంలో అభ్యంతరాలు, సూచనలు వివిధ ప్రాంతాల నుంచి ఇప్పటికే ప్రభుత్వానికి అందాయి. . కొత్త జిల్లాలు ఏర్పాటయితే జవహర్ నవోదయ విద్యాలయాలు, మెడికల్ కాలేజీల లాంటి వాటిని కేంద్రాన్ని అడిగే అవకాశం ఉంటుందని చెప్పారు. కొత్త జిల్లాలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారని.. 3 లక్షల చదరపు అడుగుల్లో కొత్త భవనాల నిర్మాణం చేపట్టాలని సీఎం జ‌గ‌న్ ఆదేశించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/