పిఎంసి బ్యాంకులో ఫోరెన్సిక్‌ ఆడిట్‌

Shaktikanta Das
Shaktikanta Das

ముంబయి: ముంబయిలోని పంజాబ్‌ మహారాష్ట్ర సహకారబ్యాంకు కుంభకోణం, అనిశ్చితి వ్యవస్థను నిశితంగా పరిశీలిస్తున్నామని, అంతేకాకుండా ప్రస్తుతం ఫోరెన్సిక్‌ ఆడిట్‌ కొనసాగుతోందని ఆర్‌బిఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ వెల్లడించారు. పిఎంసి బ్యాంకు దేశంలోని పది అర్బన్‌ కోఆపరేటివ్‌బ్యాంకుల్లో అగ్రస్థానంలో నిలిచింది. కుంభకోనం వెల్లడి కావడంతో ఇపుడు ఆర్‌బిఐ నియమించిన పర్యవేక్షకుని అధీనంలో నడుస్తోంది. గతనెల 23వ తేదీనుంచి ఆరునెలలపాటు ముందు పరిశీలన చేస్తుంది. అంతేకాకుండా బ్యాంకుజారీచేసిన రుణాల మొత్తాన్ని నిశితంగా ఆడిట్‌చేయిస్తోంది. ఆర్‌బిఐ ఇప్పటివరకూ విత్‌డ్రా పరిమితులు విధించిందని ఇప్పటివరకూ 50వేలకు మాత్రమే అనుమతిస్తున్నట్లు వెల్లడించింది. హెచ్‌డిఐఎల్‌ మౌలికవనరుల సంస్థకు 4355 కోట్ల రూపాయలు రవాణాలను ఏకపక్షంగా బదిలీచేయడాన్ని ఆర్‌బిఐ తీవ్రంగాపరిగణించింది. హెచ్‌డిఐఎల్‌ ప్రమోటర్లు రాకేష్‌, సారంగ్‌ వాద్వాన్‌లతోపాటు ఐదుగురు ప్రముఖులను ఇప్పటివరకూ పోలీసులు అరెస్టులుచేసారు. డిపాజిటర్లు అనేక పర్యాయాలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/sports/