విదేశియులు నేరుగా క్వారంటైన్ కేద్రాలకు
కరోనా వ్యాప్తి నేపథ్యంలో కఠిన చర్యలు

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రొజురోజుకు పెరుగుతుంది. ఇది కేవలం విదేశి ప్రయాణికుల ద్వారానే తెలంగాణలో వ్యాపిస్తుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. దీంతో విదేశీ ప్రయాణికులు విమానం దిగగానే వారి పాస్‌పోర్ట్‌లను స్వాధీనం చేసుకుని వారికి క్వారంటైన్ స్లిప్‌లు ఇచ్చి క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తోంది. ఈ కేంద్రాల వద్ద ఏసీపి స్థాయి అధికారి ఇంచార్జిగా నియమించారు. కాగా వికారాబాద్, గచ్చిబౌలి స్టేడియం, ధూలపల్లి, నారాయణమ్మ కాలేజ్, అమీర్‌పేట నేచర్ క్యూర్ హస్పిటల్, రాజేంద్రనగర్ ఎన్‌ఐఆర్‌డీ, ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ వద్ద ఈ క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/