భారత్‌ మార్కెట్‌కోసం ఫోర్డ్‌ మహీంద్ర జాయింట్‌ వెంచర్‌

mahindra, ford
mahindra, ford

ఫోర్టు, మహీంద్ర కంపెనీల జాయింట్‌ వెంచర్‌తో భారత్‌లో ఇకపై కొత్త కార్లు ఉత్పత్తి అవుతున్నాయి. 2017చివరిలోనే జనరల్‌మోటార్స్‌ భారత్‌కార్యకలాపాలు నిలిపివేఇసంది. ప్రధాని మేకిన్‌ ఇండియాకు కంపెనీ తట్టుకోలేకపోయింది. అలాగే మిషిగాన్‌లోని ఫోర్డ్‌ సంస్థ భారత్‌లో రెండుదశాబ్దాలక్రితమే వచ్చినా అంతగా నిలదొక్కుకోలేకోయింది. భారత్‌ ఆటోమొబైల్‌ మార్కెట్‌లో మూడుశాతం వ3ఆటాతోమాత్రమే సరిపెట్టుకుంది. దీనితోనే మహీంద్రతో జట్టుకట్టేందుకు నిర్ణయించింది. కొత్త డీల్‌ను అనుసరించి ఫోర్డ్‌భారత్‌లో యూనిట్‌ను నెలకొల్పుతుంది. 49శాతం ఫోర్టు, 51శాతం మహీంద్రాకు ఉంటుంది. ఫోర్డుకు భారత్‌ఓ ఉనన కార్యకలాపాలను కొత్తసంస్థకు మళ్లిస్తుంది. ఫక్షర్టు ఆస్తులు, ఉద్యోగులుసైతం జాయింట్‌ వెంచర్‌లోనికి వచ్చేస్తారు. కొత్త డీల్‌ మరో 90 రోజుల్లోనే పూర్తి అవుతుందని అంచనా. రెండు కంపెనీలు వాణిజ్య,తయారీ సామర్ధ్యాలను పెంచుకునేందుకు లక్ష్యాలను సాధించేందుకు వ్యూహాత్మక సహకారం ఇచ్చిపుచ్చుకోవాలనినిర్ణయించాయి. వ్యూహాత్మక భాగస్వామ్యం కింద 2017లొఓ ఫోర్టు మహీంద్రతో ఒప్పందం చేసుకుంది. కొత్త కార్ల తయారీ, ఎస్‌యువిల తయారీ విద్యుత్‌కార్లను తయారుచేస్తాయి. 11 బిలియన్‌ డాలర్లను ఆదాచేసేందుకు ఫోర్డ్‌ ఇండియా మాతృసంస్థ ఫోర్డు ప్రపంచ వ్యాప్తంగా తన కార్యకలాపాలను పునరేకీకరిస్తోంగది. ఐదేళ్లలో 11 బిలియన్‌ డాలర్ల వ్యయాన్ని తగ్గించే లక్ష్యంగా నిర్ణయించింది. రష్యాలోని ఫోర్టు జాయింట్‌ వెంచర్‌ అక్కడి రెండు అసెంబ్లీ ప్లాంట్లనుసైతం మూసివేస్తామనివెల్లడించింది. రష్యామార్కెటనుంచి నిష్క్రమిస్తోంది. శరవేగంగా ఆటోమొబైల్‌ మార్కెట్లు వృద్ధిచెందుతున్న దేశాల్లో భారత్‌ ఒకటి. ఇటీవలికాలంలో కార్ల విక్రయాలు ఎనిమిదిశాతంనుంచి మూడుశాతానికి తగ్గాయి. 2023నాటికి భారత్‌ప్రపంచంలోనే మూడో అతిపెద్ద కార్లమార్కెట్‌గా వస్తుందని అంచనా. వార్షిక విక్రయాలు సైతం ఐదు మిలియన్లను దాటుతున్నాయి. ఈ మార్కెట్లలో మారుతిసుజుకి, హుండైలో రాజ్యమేలుతున్నాయి. మారుతిసుసుకి దాదాపు 51శాతం వాటాతో ఉంది. అతిపెద్ద డీలర్‌షిప్‌ నెట్‌వర్కు, స్వతంత్ర లోకల్‌ టీమ్‌లు అందుకు కలిసివస్తున్నాయి. ఇపుడు కొత్తగా ఫోర్డ్‌ మహీంద్ర డీల్‌తో ఈసంస్థఉ సైతం కొత్తమోడళ్లను అతితక్కువ ఖర్చుతో వృద్ధిచేసి మార్కెట్లను శాసించే అవకాశం లేకపోలేదు.

మరిన్నీ తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి :https://www.vaartha.com/news/business