ఫోర్బ్స్‌ జాబితాలో

Prabhas-Mahesh

ఫోర్బ్స్‌ ఏటా సెలబ్రిటీలకుఇచ్చే ర్యాంకులపై సర్వత్రా ఆసక్తి నెలకొనిఉంటుంది. ఎవరు టాప్‌ ర్యాంక్‌ సాధించారు. ఎవరు టాప్‌ టెన్‌లో ఉన్నారనేది సోషల్‌మీడియాలో కూడ హాట్‌ టాపిక్‌గా మారుతుంది.. 2019 ఏడాదికి టాప్‌ 100 సెలబ్రిటీల జాబితా విడుదల చేశారు. ఈజాబితాలో మొదటిస్థానంలో విరాట్‌ కోహ్లి నిలిచారు.. రెండో స్థానంలో అక్ష§్‌ుకుమార్‌, గత ఏడాది మొదటిస్థానంలో ఉన్న సల్మాన్‌ ఖాన్‌ ఈఏడాది మూడవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది..

అమితాబ్‌ బచ్చన్‌ (4), ఎంఎస్‌ ధోనీ (5), షారూక్‌ఖాన్‌ (6), రణవీర్‌సింగ్‌ (7), ఆలియాభట్‌ (8), సచిన్‌ టెండూల్కర్‌ (9), దీపికాపడుకొనే (10), టాప్‌టెన్‌లో ఉన్నారు.టాలీవుడ్‌ నటుడు ప్రభాస్‌ (44), సూపర్‌స్టార్‌ కృష్ణ(54) స్థానాల్లో నిలిచారు.. ఇతర స్టార్లలో రజనీకాంత్‌ (13),, ఎఆర్‌ రెహమాన్‌ (16), మోహన్‌లాల్‌ (27), తమిళ స్టార్‌ హీరో విజ§్‌ు (47), దర్శకుడు శంకర్‌ (55) , కమల్‌హాసన్‌ (56) ర్యాంకుల్లో ఉన్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/