చిగుళ్ల ఆరోగ్యానికి పటిక

Cinnamon jaggery

చిగుళ్లు దృఢంగా ఉన్నప్పుడే పళ్లు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. శరీరంలోని ప్రతి అవయవానికి రక్షణ వ్యవస్థ ఉంటుంది. అలాగే పళ్లకు చిగుళ్లకు కూడా. చిగుళుల గులాబీ రంగులో ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్లు. లేదంటో ఏదో అనారోగ్యం ఉన్నట్లే. చిగుళ్ల నుంచి రక్తం కారడం, రంగు మారడం, కుంచించుకుపోవడం, పంటికీ, చిగుళ్లకి మధ్య గారపట్టడం, ఆకుపచ్చ లేదా నల్లని గారగా తయారవడం, చీము పట్టడం వంటి లక్షణాలు కనబడతాయి. నోటి నుండి దుర్వాసన వస్తుంది. వీటి కారణంగా పళ్లు బలహీనమై, కదిలిపోతాయి. పంటి పోటు కూడా వస్తుంది. రాత్రి పడుకునే ముందు, ఉదయం నిద్రలేవగానే పళ్లు తోముకోవాలి. నోట్లో హానికారకమైన బ్యాక్టీరియాలు ఎక్కువ. ఇవి రాత్రిపూట పళ్లలో మిగిలిన ఆహారంపై ఉండిపోయి పళ్ల అనారోగ్యానికి, చిగుళ్ల ఇన్‌ఫెక్షన్‌కి దారి తీస్తాయి. అందుకే రాత్రి పళ్లు తోముకోవడం తప్పనిసరి. అలాగే ఆహారం తిన్న ప్రతిసారి నోట్లో నీళ్లు పోసుకుని బాగా పుక్కిలించి ఉమ్మేయం మంచిది. దంతాల్ని ఆరోగ్యంగా ఉంచడంలో కాల్షియం కీలక పాత్ర పోషిస్తుంది. పాలు, పెరుగు, చీజ్‌, సోయా, రాగులు తీసుకోవాలి.

పళ్లకు హానిచేసే బిస్కెట్లు, చాక్లెట్లు తీపిపదార్థాలు, మైదా వంటివి తగ్గించాలి. విటమిన్‌ సి ఉండే నిమ్మ, బత్తాయి, కమలాపండ్లు, అనాస, దానిమ్మ పండ్లను తీసుకోవాలి. రోజూ పళ్లు తోముకున్నా తరువాత చెంచా నువ్వుల నూనెతో చిగుళ్లపై మర్దన చేయాలి. చెంచా నువ్వులు నోట్లో వేసుకుని నెమ్మదిగా నమిలి తింటూంటే చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీళ్లలో కాస్త ఉప్పువేసి ఆ నీటిని పుక్కిలించి ఉమ్మేస్తే చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. ఇప్పటికే చిగుళ్లు అనారోగ్యంగా ఉన్నవారు గ్లాసు నీళ్లలో చెంచా కరక్కాయ చూర్ణం వేసి కాచి, గోరువెచ్చగా అయిన తరువాత పుక్కిలించి ఉమ్మేయాలి. నిత్యం చేస్తే చిగుళ్ల నుంచి రక్తం కారడం, చీము పట్టడం వంటి సమస్యలు ఉండవు. చిగుళ్ల అనారోగ్యానికి పటిక భస్మం మంచి ఔషధం. పటిక ముక్కలను గిన్నెలో వేసి వేడిచేస్తే పాక్‌కార్న్‌గా పొంగుతాయి. చల్లారిన తరువాత వాటిని పొడి చేసి భద్రపరచుకోవాలి. గ్లాసు గోరువెచ్చని నీటిలో పావు చెంచా పటిక భ్మం వేసి, ఆ నీటితో రోజూ పుక్కిలిస్తే చిగుళ్ల అనారోగ్యాలు తగ్గుముఖం పడతాయి.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/