చలికాలం మృదువైన మేనికి అరటిపండు.. బాదం నూనె

చర్మసంరక్షణ చిట్కాలు

For soft skin beauty in winter


చలికాలం విసిగించే సమస్య చర్య పొడిబారడం. మృతకణాలు పెరగడం. దీనికి వీరుగుడుగా రోజూ ఈ విధంగా చేస్తూ ఉంటే సమస్యకు తగిన పరిష్కారం లభిస్తుంది.

అరటిపండు గుజ్జు, కప్పు పెరుగు, టేబుల్‌ స్పూన్‌ తేనె, టేబుల్‌ స్పూన్‌ ఓట్స్‌ కలపాలి. ఈ మిశ్రమం పొడి చర్మానికి మంచి ప్యాక్‌ అవుతుంది. ముఖానికి, మేనికి పట్టించి, పదిహేను నిమిషాల తర్వాత వెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. దీనివల్ల చర్మం నునువుగా మారుతుంది.

స్నానానికి ముందు టీ స్పూన్‌ బాదం నూనె, అర టీ స్పూన్‌ తేనె కలిపి ముఖానికి, చేతులకు రాసి పాదాలకు మసాజ్‌ చేయాలి.

అలాగే స్నానం చేసేముందు అరీస్పూన్‌ బాదం నూనె బకెట్‌ నీటిలో కలపాలి. స్నానానికి సబ్బులను ఉపయోగించకుండా రోజూ ఇలా చేస్తూ ఉంటే చర్మం మృదుత్వాన్ని కోల్పోదు.

చలికాలం నూనె ఉన్న మాయిశ్చరైజర్లు వాడాలి. అలివ్‌ ఆయిల్‌, అలొవెరాజెల్‌ సమపాళ్లలో తీసుకొని అందులో కొద్ది వెనిలా ఎసెన్స్‌ కలపాలి. ఈ మిశ్రమాన్ని చలికాలం మాయిశ్చరైజర్‌గా ఉపయోగించవచ్చు.

టీ స్పూన్‌ శనగపండిలో అరటీ స్పూన్‌ తేనె, పచ్చిపాలు, చిటికెడు గంధం పొడి కలిపి ముఖానికి రాసుకోవాలి. అరగంట తర్వాత శుభ్రపరచుకోవాలి. వారానికి రెండుసార్లు ఈ విధంగా చేస్తూ ఉంటే పొడిబారి ముఖ చర్మం ముడతలు తగ్గుతాయి.

చర్మం పొడిబారకుండా ఉండాలంటే మృతకణాలను తొలిగిస్తూ ఉండాలి. అలాగని చర్మాన్ని మరీ రబ్‌ చేయకూడదు.

కార్న్‌ఫ్లేక్స్‌ని పొడి చేసి అదులో తేనె, పాలు కలిపి చర్మానికి పట్టించి మర్దనా చేయాలి. మృతకణాలు తొలగి పోయి చర్మం మృదువుగా మారుతుంది.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/