ఆకట్టుకునే అందం కోసం..
అందమే ఆనందం

మహిళలు ముఖ సౌందర్యానికి ఎంతగానో ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే కొందరు స్త్రీలు బ్లాక్ హెడ్స్‌తో మొటిమల కారణంగా ఏర్పడిన మచ్చలతో తీవ్రంగా ఇబ్బంది పడుతుంటారు. నిత్యం వాటిని తొలగించు కునే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. బ్యూటీ పార్లర్స్ చుట్టూ తిరుగుతుంటారు.
మార్యెట్‌లో దొరికే రకరకాల క్రీమ్స్, లోషన్స్ వాడుతూ నానా హైరానా పడుతుంటారు. అలాంటి వారి కోసమే ఈ ఫేస క్లీనర్. ఇది ఇంట్లో ఉంటే ఎప్పుడు కావలిస్తే అప్పుడు ముఖాన్ని నీట్‌గా, క్లీన్‌గా, చూడముచ్చటగా సిద్ధం చేసుకోవచ్చు.
దీన్ని ఉపయెగించిన తర్వాత ఫేస్‌లో కొత్త కళ కనిపిస్తుంది. అదెలా ఉంటే ఈ గాడ్జెట్‌తో పాటు నాలుగు రకాల ప్రోబ్స్ లభిస్తాయి. ఒక్కదానికి ఒక్కో సైజ్ హోల్ ఉంటుంది. వీటిని గార్జెట్‌కి అమర్చుకుని ఫేస్ క్లీన్ చేసుకోవచ్చు.
మొదటిది బిగ్ రౌండ్ ప్రోచ్ (పెద్ద రంధ్రం ఉంటుంది). దీన్ని ఉపయోగించి ముఖం మీద బ్లాక్ హెడ్స్‌ని తొలగించుకోవం తోపాటు మొండి మచ్చలు తొలగించుకోవచ్చు. రెండవది స్మాల్ రౌండ్ ప్రోచ్ (చిన్న రంధం ఉంటుంది). దీన్ని ముక్కు భాగంలో ఉపయోగించి బ్లాక్‌హెడ్స్‌ని తొలగించి క్లీనప్ చేసుకోవచ్చు.
మూడవది ఓవెల్ ప్రోచ్. గీతలు, చారలు తొలగించడానికి సహకరిస్తుంది. నాలుగవది స్కిన్ రెజు వెనేట్ ప్రోబ్. గీతలు, చారలు తొలగించడానికి సహకరిస్తుంది. నాలుగవది స్కిన్ రెజువెనెట్ ప్రోబ్. దీన్ని ఉపయోగించి ముఖంలో కాంతిని నింపడంతో పాటు మృతకణాలను తొలగించుకోవచ్చు.
ఈ అటాచ్‌మెంట్స్‌ని మార్చు కోవడంతో పాటుగా మోడ్స్‌ని కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. సాప్ట్, నార్మల్, స్ట్రాంగ్ అనే ఆప్షన్స్ ద్వారా మోడ్స్‌ని ఛేంజ్ చేసుకోవచ్చు.=
తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/