ఇమ్యూనిటీ కోసం

ఆహారం-ఆరోగ్యం

Immunity boosting Food
Immunity boosting Food

వర్షాకాలంలో తరచుగా వేధించే జలుబు, దగ్గు తో పాటు ఇతర ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా ఉండేందుకు ఔషద గుణాలున్న డ్రింక్‌ తీసుకోవాలి. ఇంట్లో లభించే పదార్థాలతోనే అలాంటి డ్రింక్‌ తయారుచేసుకోవచ్చు.

కావలసినవి :

కొద్దిగా అల్లం, నల్ల యాలకులు-1, పచ్చి యాలకులు-2, నల్ల మిరియాలు -8, దాల్చి చెక్క – ఒకటి,
లవంగాలు అయిదు, తలసి ఆకులు – ఎనిమిది, బిర్యానీ ఆకు ఒకటి, తేనె టేబుల్‌ స్పూన్‌, నల్ల ఉప్పు, నిమ్మరసం రుచికి సరిపడా.

తయారీ విధానం :

చిన్న రోలు తీసుకొని అందులో అల్లం యాలకులు, మిరియాలు, లవంగాలు వేసి మెత్తని పొడి తయారుచేసుకోవాలి. తరువాత తులసి ఆకులు వేసి రుబ్బాలి.

  • ఇప్పుడు ఒక పాన్‌లో రెండు కప్పుల నీల్లు పోసి, స్టవ్‌ మీద పెట్టాలి. సుగుంద ద్రవ్యాల పోడి, బిర్యానీ ఆకు వేసి కాసేపు మరిగించాలి.
  • తరువాత మంట తగ్గంచి పది నిమిషాలు అలానే ఉంచాలి. ఇప్పుడు డ్రింక్‌ను కప్పులో వడబోసి, ఉప్పు నిమ్మరసం, తేనె రుచికి తగినంత కలుపుకొంటే ఇమ్యూనిటీ డ్రింక్‌ రెడీ.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/