గోవా ముఖ్యమంత్రిగా ఇంకా ఆయన పేరే!

 Manohar Parrikar
Manohar Parrikar

పణజీ:గోవా ముఖ్యమంత్రిగా ఉండగా మనోహర్‌ పారికర్‌ తీవ్ర అనారోగ్యం బారినపడి మార్చి 17న మృతి చెందిన విషయం తెలిసిందే. కానీ ఆయన పేరున నిన్న ఓ ప్రకటన విడుదల చేసి ఆ రాష్ట్ర సమాచార శాఖ నవ్వులపాలయ్యింది. గురుపూజోత్సవం సందర్భంగా గోవాలోని ఉపాధ్యాయుందరికీ ప్రభుత్వం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ అని ఉండడంతో విస్తుపోవడం ఉపాధ్యాయులు, అధికారుల వంతయ్యింది. పారికర్‌ చనిపోయిన తర్వాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమోద్‌సావంత్‌ బాధ్యతలు స్వీకరించారు. కానీ ఈ విషయం మర్చిపోయిన అధికారులు మనోహర్‌ పేరుతో ప్రకటన విడుదల చేసి అబాసుపాలయ్యారు. ఈ ప్రకటనపై విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం బాధ్యులపై దర్యాప్తునకు ఆదేశించింది. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/