కంటి ఆరోగ్యానికి ..
నేత్రాలు -జాగ్రత్తలు

కళ్లు ఎరుపెక్కడం, మంటగా ఉండటం వంటి ఇరిటేషన్ సమస్యకు సరైన ఆహారం కూడా ఉంటుందంటున్నారు నిపుణులు. దుమ్ము, ధూళి పడినప్పుడు కళ్ల ఇరిటేషన్ వస్తుంది.
సాధారణంగా ముఖంపై ఉన్న ఆయిల్, జిడ్డు కళ్ల కొసలు, రెప్పల నుంచి కళ్లలోకి వెళ్లినప్పుడు కూడా ఇరిటేషన్ వస్తుంది. ఇది చాలా మంది గమనించరు.
ఇందుకు పరిష్కారం కళ్లను రోజుకు మూడుసార్లు మంచినీళ్లతో కడుక్కోవాలి. ఇక ఎలర్జీ నుంచి రక్షించుకోవడానికి, కళ్లు కాంతివంతంగా ఉండేందుకు ఆకుకూరలు, క్యారెట్, బీట్‌రూట్, బొప్పాయి, మామిడిపండ్లు తప్పనిసరిగా తీసుకోవాలి.
వీటిలో బీటా కెరోటిన్ సమృద్ధిగా లభిస్తుంది.ఇది కంట ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
ఆకుకూరల్లో గ్జాంతిన్, జీ గ్జాంతిన్, ల్యుటిన్ అనే ఎలిమెంట్స్ కంటి ఆరోగ్యానికి తోడ్పడుతాయి. వయసు వల్ల వచ్చే కంటి చూపు తేడాలు, కంటి కండరాల వీక్‌నెస్‌ను తగ్గిస్తాయి.
బీటా కెరోటిన్ రిచ్ సూప్ కంటి ఆరోగ్యాన్ని రక్షిస్తుంది.
తాజా బిజినెస్ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/