అట్టహాసంగా స్టేడియం ప్రారంభం

అమీర్‌ కప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీఫైనల్స్‌కు వేదిక

Football stadium opening
Football stadium opening

దోహా : ప్రపంచకప్‌ ఫైనల్స్‌కు ఆతిథ్యమిచ్చే అల్‌ రయాన్‌ స్టేడియంను శనివారం అట్టహాసంగా ప్రారంభించారు. ఖతార్‌ జాతీయ దినోత్సవమైన డిసెంబరు 18న, ప్రపంచకప్‌ ఆరంభోత్సవానికి సరిగా రెండేళ్ల ముందుగా ఈ కార్యక్రమం నిర్వహిం చారు.

ఖతార్‌ నిర్వహించే అమీర్‌ కప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీ ఫైనల్స్‌ ఇందుకు వేదికగా మారింది. మ్యాచ్‌ ఆరంభానికి ముందు బాణసంచా కాల్చి లాంఛనంగా స్టేడియం ప్రారంభోత్సవం నిర్వహిం చారు. అల్‌ అరబితో జరిగిన మ్యాచ్‌లో అల్‌ సద్‌ జట్టు 2-1తో గెలిచి ట్రోఫీని దక్కించుకుంది. అల్జీరికా ఫార్వర్డ్‌ బాగ్దాద్‌ బౌనెద్జ విజేత జట్టుకు రెండు గోల్స్‌ సాధించిపెట్టాడు.

40వేల సామర్ధ్యం కలిగిన ఈ స్టేడియం ప్రారంభోత్సవానికి హాజరైన ఫిఫా అధ్యక్షుడు గియాని ఇన్‌ఫాంటినో స్టేడియం నిర్మాణంపట్ల సంతోషం వ్యక్తంచేస్తూ ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్మించారని, ప్రంపచకప్‌ స్థాయి స్టేడియంను సకాలంలో అందుబాటులోకి తెచ్చిన ఖతార్‌ను ప్రశంసించారు. ఈ స్టేడియంతోపాటు ఖలీఫా ఇంటర్నేషనల్‌, అల్‌ జనాబ్‌, ఎడ్యుకేషన్‌ సిటీ స్టేడియంలుకూడా నిర్మాణాలు పూర్తిచేసుకుని ప్రపంచకప్‌కు సిద్ధంగా ఉన్నాయి.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/