ఫుట్‌బాల్‌: బెంగళూరుపై ముంబయి ఘనవిజయం

ఇండియన్‌ సూపర్‌లీగ్‌

Football- Mumbai's solid win over Bangalore
Football- Mumbai’s solid win over Bangalore

గోవా : ఇండియన్‌ సూపర్‌లీగ్‌ ఫుట్‌బాట్‌ చాంపియన్‌షిప్‌లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఎఫ్‌సి 3-1తో బెంగళూరు ఎఫ్‌సిపై ఘన విజయం సాధించింది. ప్రథమార్ధంలోనే ముంబయి రెండు గోల్స్‌తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

ద్వితీయార్ధంలో ఇరు జట్లు చెరో గోల్‌ చేశాయి. ముంబయి జట్టులో మోర్తడా(9ని.), బిపిన్‌(15ని.), ఒబెచె(84ని.) గోల్స్‌ చేయగా, బెంగళూరు ఏకైక గోల్‌ను ఛెత్రి(78ని.) సాధించాడు. బుధవారం ఎస్‌సి ఈస్ట్‌బెంగాల్‌, ఎఫ్‌సి గోవా జట్లు తలపడనున్నాయి.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/