మరీ అంత వేడి వద్దు

FOOD
FOOD

మరీ అంత వేడి వద్దు

కొంతమందికి రుచి మాత్రమే కాదు. వేడివేడిగా భోజనం తీసుకుంటారు. ఫాస్ట్‌ఫుడ్‌ షాపులకు వెళ్తే…బాణలి నుంచి ఫ్రైడ్‌ నూడిల్స్‌ను వేడివేడిగా తీసుకునే అలవాటున్న వారు చాలామంది ఉన్నారు. మార్నింగ్‌ కాఫీ నుంచి అన్నంలోకి తీసుకునే రసం వరకు వేడివేడిగా రుచిగా ఉండాలంటూ లొట్టలేసుకుని తినేవారు ఎంతోమంది ఉన్నారు. అయితే ఇలా వేడివేడిగా ఆహార పదార్థా లను తీసుకోవడం మంచిదా? కాదా? అని తెలుసుకోవాలంటే… వేడివేడిగా కాకుండా మితమైన వేడితో ఉండే ఆహారాన్ని తీసు కోవచ్చు. వేడివేడిగా అన్నం తీసుకుంటే… ఆహారాన్ని సులభంగా పేగు లోకి తీసుకెళ్లే మ్యూకోసాకు ప్రమాదమని వారు హెచ్చరిస్తున్నారు. వేడివేడిగా తీసుకునే ఆహారం ద్వారా మ్యూకోసా వ్యవస్థ దెబ్బతింటుందని, తద్వారా అల్సర్‌ ఏర్పడే ప్రమాదముందని ఆరోగ్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరంభంలో దీనిని గమనించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అదే క్యాన్సర్‌కు కారకమవ్ఞతుంది. వేడివేడి ఆహారం తీసుకునేటప్పుడు జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. అందుచేత వేడివేడి అన్నమైనా… శీతాకాలంలో వేడివేడి నీటిని తీసుకునేటప్పుడూ అవి మితంగా ఉండేలా చూసుకోవాలి. ప్లేటులోకి అన్నం కాస్త ఆరాక తినడమే మంచిది. అలాగే కాఫీ కూడా వేడివేడిగా తీసుకోకపోవడం మంచిది. ఇందులోని కెఫిన్‌ జీర్ణక్రియను దెబ్బతీస్తుందని ఆరోగ్యనిపుణులు అంటున్నారు.